Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీఆర్ఏను ట్రాక్టర్‌తో గుద్ది చంపేశారు.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. విలేజ్ రెవెన్యూ అధికారి(వీఆర్ఏ)ను ట్రాక్టర్‌తో గుద్దించి చంపేసింది. ఇంత దారుణానికి పాల్పడటానికి ప్రధాన కారణం... ఆ వీఏవో ఇసుక అక్రమ ర

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (12:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. విలేజ్ రెవెన్యూ అధికారి(వీఆర్ఏ)ను ట్రాక్టర్‌తో గుద్దించి చంపేసింది. ఇంత దారుణానికి పాల్పడటానికి ప్రధాన కారణం... ఆ వీఏవో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే. జిల్లాలో కలకలం రేపిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలం కంబాపూర్ గ్రామశివారులో కాకివాగు వద్ద నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఆ గ్రామ వీఆర్ఏగా పని చేస్తున్న సాయిలుకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన అక్కడకుచేరుకుని ఇసుక తరలిస్తున్న మాఫియాను అడ్డుకున్నాడు. 
 
ఈ క్రమంలో ఇసుకు మాఫియా సభ్యులకు, వీఆర్ఏకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుక మాఫియా వీఆర్ఏ సాయిలు పైనుంచి ట్రాక్టర్‌తో ఢీకొట్టి తొక్కించగా, తీవ్రంగా గాయపడిన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు.
 
ఇసుక మాఫియా ఆగడాలకు వీఆర్‌ఏ సాయిలు చనిపోయిన విషయం తెలుసుకు కారెగాం, మార్తాండ గ్రామస్థులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. సమాచారం అందిన వెంటనే స్థానిక ఎమ్మార్వో, పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు గ్రామాల ప్రజలను శాంతింపజేసేందుకు యత్నిస్తున్నారు. నిందితులు పరారీలో ఉండగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments