పోలీసు శాఖలో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అధికారి సజ్జన్నార్ ఆర్టీసీ ఎండీగా కూడా తన సైల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలతో సజ్జన్నార్ అందరి దృష్టిని ఆర్టీసీ వైపు తిప్పారు.
తాజాగా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా బాలింతలు పిల్లలకు పాలిచ్చేందుకు బస్టాండ్లలో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్లలో పాలిచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సజ్జన్నార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటగా ఈ కేంద్రాలను హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో ప్రారంభించనున్నారు.
ఆ తర‌్వాత రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలోనూ పాలిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలని సజ్జన్నార్ నిర్ణయం తీసుకున్నారు. సజ్జన్నార్ వినాయక చవితి సంధర్బంగా వినాయకుడిని బస్సులో తీసుకువెళ్లి నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనపై ప్రజలు ప్రశంసలు కురిపించారు.