Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్మీక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు విఫలం

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (17:51 IST)
కార్మీక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. సమ్మె నోటీసులు పేర్కొన్న 46 అంశాలపై చర్చలు జరగాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. అయితే ఆర్ధికపరమైన కానీ 21 అంశాలపై చర్చలు జరుపుతామని యాజమాన్యం పేర్కొంది.

దీంతో చర్చలు ప్రారంభమైన 45 నిమిషాల లోపే జాక్ నేతలు బయటకు వచ్చేశారు.. కాగా, ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వాసుదేవరావు, వీఎస్ రావు చర్చలకు హాజరయ్యారు.

కాగా ఆర్టీసీ యాజమాన్యంతో చర్చల కోసం 16 మంది జేఏసీ నేతలు రాగా ఆర్టీసీ ఎండీ నలుగురు నేతలను మాత్రమే చర్చలకు ఆహ్వానించారు. మిగతా వారికి అనుమతి లేదంటూ పోలీసులు గేటు దగ్గరే ఆపేశారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తర్వాత తొలిసారి ఇరువర్గాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
 
హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ సమస్యలపై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈడీల కమిటీ నియమించింది. కమిటీ స్టడీ చేసి నివేదికను సంస్థ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మకు  25వ తేదీ శుక్రవారం ఉదయం  రవాణ శాఖ మంత్రికి అందచేశారు.

ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు మంత్రి నివేదిక అందించారు. మొత్తంగా చర్చలకు సీఎం కీసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆర్టీసీ విలీనం ప్రస్తావన లేకుండా ఆర్థిక భారం లేని అంశాలపై సంఘాలతో చర్చలు జరపాలని ఆర్టీసీ యాజమాన్యానికి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.దీని అనుసరించి నేడు చర్చలు ప్రారంభమైన, అవి విఫలమయ్యాయి..
 
చర్చలలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు- అశ్వద్ధామరెడ్డి
ఎర్రమంజిల్ లో ఆర్టీసీ సంఘాలతో యాజమాన్యం చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. చర్చలపై మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి మాట్లాడుతూ కేవలం 21 డిమాండ్లపై మాత్రమే చర్చకు రావాలని యాజమాన్యం కోరిందని, తాము మొత్తం డిమాండ్లపై చర్చజరపాలని కోరామన్నారు.

ఆర్టీసీ ఈడీలు, ఉన్నతాధికారులు, ఐకాస నేతలు పాల్గొన్నా నేతలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. కోర్టు ఆదేశాలను మార్చి చర్చలు జరగకుండానే సమ్మె విరమించాలని తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
 
నియంతలా కేసీఆర్ : వీహెచ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ మినహా అన్ని పక్షాలు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నాయన్నారు. చర్చలు సఫలమైతే విజయోత్సవ సభ.. కాకపోతే సమరభేరి అని ఉంటుందని వీహెచ్ హెచ్చరించారు.
 
 
ఆర్టీసీకి లేని దసరా సంబురాలు.. దీపావళి వెలుగులు
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఈ ఏడాది రెండు పెద్ద పండుగలు లేకుండానే పోయాయి. సరిగా దసరాకు ముందే సమ్మెకి వెళ్లిన ఆర్టీసీ సంఘాలు ఇరవై రెండో రోజు కూడా సమ్మె బాటలోనే ఉండిపోవడంతో దీపావళి కూడా వచ్చేసింది. ఆర్టీసీ సంఘాలు పట్టువీడకపోగా ప్రభుత్వం కూడా మెట్టు దిగడం లేదు.

దసరాలాంటి పెద్ద పండుగను బేస్ చేసుకొని ఆర్టీసీ సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని సంఘాలు సమ్మెకి పూనుకుంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలతో పండగను ముగించి కార్మిక సంఘాలపై ఒత్తిడి ప్రారంభించింది.
 
ఈ సమ్మెకి కారణం ఎవరన్న విషయం పక్కనపెడితే సమ్మె కారణంగా ప్రజలు ముఖ్య పండగలకు నానా ఇబ్బందులు పడగా కార్మికులు, ఉద్యోగులు పండగ సంబరాలకు దూరమయ్యారు. సరిగా దసరా రోజునే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి బస్సులను నడిపించడంతో ఆర్టీసీ కార్మికులంతా రోడ్ల మీదకి చేరి అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

దసరా మొత్తం ఆందోళనలు, నిరసనలతో గడిపేశారు. కార్మికులు చేసిన పనికి కూడా వేతనాలు చెల్లించకుండా డిస్మిస్ బాంబు విసిరడంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ఇళ్లలో సంబురాలు లేకుండా పోయాయి.
 
దసరా పోయి దీపావళి వస్తున్నా సమ్మెపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఈడీలతో వేసిన కమిటీ నివేదికను యాజమాన్యానికి అప్పగించగా యాజమాన్యం ఆర్టీసీ జేఏసీతో చర్చలకు దిగింది. మొత్తం 26 డిమాండ్లలో 21 డిమాండ్లపై ఈ చర్చ జరగనుండగా రెండు వర్గాలు పంతాలు వీడి సమ్మె విరమిస్తే ఆందోళనకు ఫుల్ స్టాప్ పడే వీలుంది.

అయితే రేపే దీపావళి పండుగ కాగా ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి జీతాలు చెల్లించే వీలు ఉంటుందా అన్నది అనుమానమే. కనుక కార్మికుల కుటుంబాలలో ఈ దీపావళికి ఇక వెలుగులులేనట్లేనని అనుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments