ఆర్టీసి కార్మికులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించేందుకు యూనివర్శిటీ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరాం, చాడ, తమ్మినేని, వివేక్ వెంకటస్వామి, పోటు రంగారావు తదితరులు హాజరు కానున్నారు.
ఇప్పటికే సభాస్థలికి వందలాది ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. మరోవైపు సభా నిర్వహకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మైకులు, సౌండ్ బాక్సులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీరుతామంటున్నారు విద్యార్థులు. రేపటి నుండి ఉద్యమాన్ని తామే నడుపుతామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు ఉస్మానియా అండగా ఉందనీ, ఆర్టీసీ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.