Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద‌రాబాదులో కూలనున్న భవనాల ఖరీదు రూ.200 కోట్లు

హైద‌రాబాద్ : ఉన్న‌వి కూల్చు... కొత్త‌వి క‌ట్టు... అపుడేగా నాలుగు పైస‌లు వెన‌కేసుకునేది... అన్న‌ట్లుంది తెలంగాణాలో టీఆర్ఎస్ పాల‌న‌. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చేసి ఆ స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో పట్టుదలగా ఉంది.

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (18:43 IST)
హైద‌రాబాద్ : ఉన్న‌వి కూల్చు... కొత్త‌వి క‌ట్టు... అపుడేగా నాలుగు పైస‌లు వెన‌కేసుకునేది... అన్న‌ట్లుంది తెలంగాణాలో టీఆర్ఎస్ పాల‌న‌. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చేసి ఆ స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో పట్టుదలగా ఉంది. ప్రస్తుతం హైకోర్టులో ఉన్న ఈ అంశంపై త్వరలోనే క్లియరెన్స్ రావడం ఖాయమని తెలుస్తోంది. కానీ, సీఎం కేసీఆర్ కూల్చాలని భావిస్తున్న భవనాల్లో ఎలాంటి లోపాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో నాలుగు బ్లాకులు ఉండగా…అందులో ఒక బ్లాక్‌ను 2000 సంవత్సరంలో టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో నిర్మించారు. 
 
అప్పట్లోనే ఇందుకోసం దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. అత్యాధునికమైన హంగులు అప్పట్లో నిర్మించిన బ్లాకులో ఉన్నాయి. ప్ర‌స్తుత లెక్కల ప్రకారం ప్రభుత్వం కూల్చబోతున్న భవనాల ఖరీదు దాదాపు రూ.200 కోట్లకు పైగా మాటే అని తెలుస్తోంది. ఈ భవనాలను కూల్చడం ద్వారా తెలంగాణ ఖజానాపై ఆ స్థాయి భారం పడుతుందని సమాచారం. 
 
ఒకవేళ తెలంగాణ సచివాలయాన్ని మరో చోట నిర్మిస్తే… ఈ భవనాలను మరో అవసరం కోసం వినియోగించవచ్చని… అప్పుడు ఈ మొత్తం మిగుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో… భవనాల కూల్చివేత కారణంగా ప్రభుత్వానికి రూ.200 కోట్ల నష్టం ఖాయమని అర్థమవుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments