Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశానికి చిల్లు - 24 గంటల్లో 26.77 మి.మీ వర్షపాతం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జులై 2021 (14:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా వర్షం కురిసింది. గత 24 గంటల్లో భారీ వర్షం పడింది. ఫలితంగా రికార్డు స్థాయిలో 26.77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. 
 
గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే మూడు రెట్లు అధికంగా ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సాధార‌ణ వ‌ర్ష‌పాతం 9.9 మి.మీ. మాత్ర‌మే. బుధ‌వారం కురిసిన వ‌ర్షానికి 20 మండ‌లాల్లో 100 మి.మీ. కంటే ఎక్కువ‌గా వ‌ర్ష‌పాతం న‌మోదైంది.
 
గురువారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు మెద‌క్ జిల్లాలోని చేగుంట‌లో అత్య‌ధికంగా 227.5 మి.మీ. వ‌ర్ష‌పాతం, రంగారెడ్డి జిల్లాలోని త‌ట్టి అన్నారంలో 216 మి.మీ., నాగోల్ ప‌రిధిలోని బండ్లగూడ‌లో 212.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 
 
ఈ మూడు ప్రాంతాల్లో అతి భారీ వ‌ర్షం కురిసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. మ‌రో 13 ఏరియాల్లో భారీ వ‌ర్షం కురవ‌గా, 142 మి.మీ. నుంచి 192 మి.మీ. మ‌ధ్య వ‌ర్ష‌పాతం న‌మోదైంది.
 
ఇకపోతే, జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ మ‌ధ్య రాష్ట్రంలో 369.7 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదు కాగా, ఈ స‌మ‌యంలో సాధార‌ణ వ‌ర్ష‌పాతం 236.33 మి.మీ. మాత్ర‌మే. 17 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 60 శాతం కంటే ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మ‌రో 13 జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వ‌ర‌కు వ‌ర్షపాతం న‌మోదైంది. మూడు జిల్లాల్లో మాత్రం సాధారణంగానే నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments