తెలంగాణ ప్రజలకు శుభవార్త - మూడు రోజుల పాటు వర్షాలు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (17:02 IST)
తెలంగాణ  రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకు ఎండకు తల్లడిల్లిపోతున్నారు. అనేక మంది వడదెబ్బకు అస్వస్థతకు లోనవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణాలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. 
 
ఉత్తర తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలపై తీవ్రమైన వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుంది పేర్కొంది. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు మధ్యాహ్నం సమయాల్లో బయటకు వెళ్లవద్దని సూచించింది. 
 
ఇదిలావుంటే, ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ ఉత్తర ఇంటీరియల్ కర్నాటక మీదుగా దక్షిణ ఇంటీరియల్ కర్నాటక వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు  వర్షాలు కురుస్తాయని తద్వారా ఎండల తీవ్రత నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments