Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం.. రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (10:36 IST)
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంపదను దోచుకుంటోందని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ సొమ్మంతా దోచుకుంటుందన్నారు. 
 
భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో రాహుల్ గాంధీ పర్యటించారు. మేడిగడ్డ ప్రాజెక్టును రాహుల్ పరిశీలించారు. మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. మహానుభావుల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు అని పేర్కొన్నారు.
 
బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకవైపు, కాంగ్రెస్‌ మరోవైపు ఉన్నాయన్నారు. ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ఉందన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ, ఎంఐఎం మద్దతు పలుకుతున్నాయన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.2500 అందజేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments