Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో వ్యభిచార కేంద్ర రాణి అరెస్టు...

హైదరాబాద్, పాతబస్తీని కేంద్రంగా చేసుకుని వ్యభిచారం కేంద్రాన్ని నడుపుతూ వచ్చిన సెక్స్ రాకెట్ క్వీన్‌ నిషా ఖాన్‌‍ను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈమె పాతబస్తీని కేంద్రంగా ముఠాను తయారు చేసుకుని దేశవ్యాప్త

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (12:49 IST)
హైదరాబాద్, పాతబస్తీని కేంద్రంగా చేసుకుని వ్యభిచారం కేంద్రాన్ని నడుపుతూ వచ్చిన సెక్స్ రాకెట్ క్వీన్‌ నిషా ఖాన్‌‍ను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈమె పాతబస్తీని కేంద్రంగా ముఠాను తయారు చేసుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తూ వస్తోంది. 
 
తాజాగా వెల్లడైన ఈ వివరాలను పరిశీలిస్తే... గతంలో పలుమార్లు వ్యభిచారం కేసులో అరెస్టు అయి, ఆపై విడుదలైంది. అయితే, జైలు నుంచి విడుదలైన తర్వాత నిషా ఖాన్.. గత మూడేళ్లుగా తన పంథా మార్చుకుంది. పేదింటి అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి కొనుగోలు చేసి, బలవంతంగా రొంపిలోకి దింపి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది. 
 
ఆమె బారినుంచి తప్పించుకున్న ఇద్దరు బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూపీ లాగిన పోలీసులు, ఉప్పల్‌లోని హ్యాపీ హోమ్స్‌లో నిషా ఖాన్ ఉందని, అక్కడే వ్యభిచార గృహాన్ని నడుపుతోందని గుర్తించారు. దీంతో పోలీసులు నిషా ఇంటిపై దాడి చేయగా, ముగ్గురు విటులు, నలుగురు అమ్మాయిలతో కలసి నిషాఖాన్ పట్టుబడింది. వీరిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం