Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక రెడ్డి కేసు, నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం: సిపి సజ్జనార్

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (20:02 IST)
సంచలనం సృష్టించిన వైద్యురాలు ప్రియాంక రెడ్డి కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సిపి సజ్జనార్ మీడియాకు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... 28 రాత్రి మాకు కంప్లైంట్ అందింది. 10 బృందాలను ఏర్పాటు చేసి గాలించాం. 29 ఉదయాన మృతదేహాన్ని గుర్తించాం. 
 
మాకు లభించిన ఆధారాలతో మహబూబ్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు అనే నలుగురు వ్యక్తులు నిందితులుగా అదుపులోకి తీసుకున్నాం. నవీన్ అనేవాడు స్కూటీ టైరు గాలి తీశాడు. ప్రియాంక తిరిగి రాగానే పంక్చర్ అయిందని నమ్మించారు.
 
ఆమె వెళ్లేందుకు సిద్ధమైతే వారించి నవీన్, శివ అనే ఇద్దరు స్కూటీ తీసుకుని వెళ్లి గాలి కొట్టించుకుని తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆమె ఆ వెహికల్ తీసుకుని వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో నలుగురు ఆమెపై దాడి చేసి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమెకి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. 
 
ఆ తర్వాత ఇద్దరు స్కూటీ పైన, మరో ఇద్దరు లారీలో అక్కడి నుంచి బయలుదేరారు. ప్రియాంక మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి లారీ క్యాబిన్లో తరలించారు. షాద్ నగర్ వంతెన కింద ప్రియాంక మృతదేహానికి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ తిరిగి వచ్చి మృతదేహం కాలిపోయిందా లేదా అని చూశారు. ఆ తర్వాత స్కూటీని సమీపంలోనే వదిలేసి లారీలో నలుగురు వెళ్లిపోయి, లారీలో వున్న ఇనుప లోడును సంబంధిత షాపు వద్ద అన్ లోడ్ చేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments