తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుపై కసరత్తు.. ఎంతంటే?

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (09:24 IST)
తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుపై సవరణ ముగిసింది. ఇంజినీరింగ్‌ ఫీజుల సవరణపై తెలంగాణ ఫీజ్‌, అడ్మిషన్స్‌ అండ్‌ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చేపట్టిన కసరత్తులో భాగంగా ఈ ఏడాది బీటెక్‌ కనిష్ఠ ఫీజు రూ.45వేలు, గరిష్ఠ ఫీజు ఎంజీఐటీలో రూ.1.60లక్షలుగా ఖరారైంది. 10 నుంచి 12 కాలేజీల్లో ఫీజులు లక్షకుపైగా ఉన్నట్టు టీఏఎఫ్‌ఆర్‌సీ పేర్కొంది. 
 
పలు కాలేజీలు తప్పుడు లెక్కలు చూపాయని, ఆడిటింగ్‌ లోపాల కారణంగా ఫీజుల్లో భారీ తేడాలున్నాయని  టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు వెల్లడించారు. ఫీజుల ఖరారుకు టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు ఈ నెల 20, 21, 22న 90కి పైగా కాలేజీలను విచారణకు పిలిచి పరిశీలించారు. 
 
వీటిన్నింటిపై కూలంకషంగా ఓ నివేదికను రూపొందించారు. శనివారం నిర్వహించే టీఏఎఫ్‌ఆర్‌సీ కమిటీ సమావేశం ముందు ఆ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అధిక ఫీజు రాబట్టాలన్న ఒక కాలేజీ గుట్టు రట్టు అయింది. గతంలో చేపట్టిన విచారణ ప్రకారం టీఏఎఫ్‌ఆర్‌సీ పలు కాలేజీలకు ఫీజులు ఖరారు చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments