Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాలెట్ పేపర్ ఎక్కడ వేయాలో తెలియని తెరాస ఎమ్మెల్యే.. క్లాస్ పీకిన హరీష్

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ దేశవ్యాప్తంగా జరిగింది. ఇందులోభాగంగా, ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలంతా తమ ఓటు హక్కున

Webdunia
సోమవారం, 17 జులై 2017 (15:19 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ దేశవ్యాప్తంగా జరిగింది. ఇందులోభాగంగా, ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలాగే, తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు. 
 
అయితే, పోలింగ్ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్లిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బ్యాలెట్ పేపరు పట్టుకుని బూత్ నుంచి బయటకు వచ్చారు. ఓటు ఎక్కడ వేయాలంటూ అడిగారు.
 
దీంతో పక్కనే ఉన్న మంత్రి హరీష్ రావు ఆయనను దగ్గరకి పిలిచి క్లాస్ పీకారు. ఓటు ఎలా వేయాలో ఇంతకుముందే చెప్పినప్పటికీ... ఇదేంటని హరీష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వివరణ ఇచ్చేందుకు ముత్తిరెడ్డి ప్రయత్నించగా... తనకేం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, నేరుగా ముఖ్యమంత్రికే వివరణ ఇవ్వాలని కోపంగా చెప్పారు. దీంతో ఆయన మరోమాట మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments