Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రితో వివాహేతర సంబంధం.. నిలదీసిన నిండు గర్భిణిని కత్తితో పొడిచిన..?

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (07:01 IST)
తండ్రితో వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళను నిలదీసిన ఓ నిండు గర్భిణి హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన బుధవారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని వైఎస్సార్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ నగర్ చెందిన వెంకటరాముడు, భారతి దంపతులు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా, పెద్ద కూతురును భీమరం గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. 
 
రెండో కూతురు లక్ష్మిదేవికి రెండేళ్ల కిందట మునిస్వామితో వివాహం అయింది. పెళ్లి అనంతరం వీరిద్దరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల లక్ష్మిదేవికి నెలలు నిండటంతో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. అయితే వెంకటరాముడు అదే కాలనీకి చెందిన సుశీల అనే మహిళతో కొంతకాలంగా వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపైనే భారతి, లక్ష్మిదేవిలు చాలా ఆవేదనతో రగిలిపోయారు. ఇందుకు సంబంధించి వారిద్దరు బుధవారం సుశీలను మందలించారు. ఆ సమయంలో సుశీల.. భారతితో పాటు లక్ష్మిదేవితో ఘర్షణకు దిగింది.
 
వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో లక్ష్మిదేవి మెడలో ఉన్న తాళి గొలుసు తెంపేసిన సుశీల దాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుంది. దీంతో లక్ష్మిదేవి తన తాళి కోసం సుశీల ఇంట్లోకి వెళ్లేందుకు చూసింది. అందులో భాగంగానే తలుపులు తోసేసింది..
 
దీంతో సుశీల ఒక్కసారి పదునైన కత్తితో లక్ష్మిదేవిపై దాడి చేసింది. అసలే గర్బిణిగా ఉన్న లక్ష్మిదేవి కడుపుపై కత్తిపోట్లు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments