ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష మృతిపై ఉపాసన ట్వీట్

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:04 IST)
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ వార్త తెలియగానే అనేక మంది షాక్‌కు గురయ్యారు. తాజాగా ప్రత్యూష  మృతిపై ఉపాసన స్పందించారు. తన డియరెస్ట్ ఫ్రెండ్ ప్రత్యూష అంటూ పేర్కొన్నారు. ఆమె చాలా త్వరగా వెళ్లిపోయిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూష మరణంతో తాను తీవ్ర వేదనకు, దిగ్భ్రాంతికిలోనైనట్టు చెప్పారు. 
 
ఆమె ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా, ఉన్నతంగా వ్యవహరించేవారని గుర్తు చేసిన ఉపాసన.. కేరీర్ పరంగా, కుటుంబ పరంగా మంచి నిర్ణయాలే తీసుకుంటూ ముందుకు సాగారన్నారు. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎంతో ఉన్నతంగా ఉంటూ వచ్చిన ఆమె.. మానసిక ఒత్తిడికి గురికావడం చాలా బాధను కలిగిస్తుందన్నారు. ప్రత్యూష ఆత్మకు శాంతికలగాలని ఉపాసన చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో తనతో తామిద్దరం కలిసివున్న ఫోటోను ఉపాసన షేర్ చేశారు. 
 
మరోవైపు, ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్ర‌త్యూష గ‌రిమెళ్ల సూసైడ్ నోట్ పోలీసుల‌కు దొరికింది. అందులో ఆమె త‌న ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రంగా వెల్ల‌డించింది. తాను స్వేచ్ఛ‌ను కోరుకున్నాన‌ని అందులో ఆమె పేర్కొంది. అంతే కాకుండా తాను ఎవ‌రికీ భారం కాద‌ల్చుకోలేద‌ని కూడా ఆమె తెలిపారు. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అనేక సార్లు య‌త్నించిన‌ట్లు చెప్పిన ప్ర‌త్యూష‌... ప్ర‌తి రోజు తాను బాధ‌ప‌డుతూనే ఉన్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments