Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు

Advertiesment
pushpa movie still
, శుక్రవారం, 10 జూన్ 2022 (14:54 IST)
పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. తాజాగా ఆయన నటించిన ఓ యాడ్ వివాదాస్పదం కావడంతో ఈ కేసు నమోదైంది. గతంలో రాపిడో సంస్థ బన్నీతో చేయించిన ప్రకటన చేయించింది. ఇది కూడా వివాదమైంది. 
 
సిటీ బస్సుల గురించి యాడ్‌లో చూపించడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఆ యాడ్ తొలగించకపోతే అల్లు అర్జున్, రాపిడో సంస్థపై కేసు వేస్తామని హెచ్చరించారు. దెబ్బకు దిగి వచ్చిన రాపిడో యాజమాన్యం అందులో సిటీ బస్సుల గురించి తీసిన షాట్ తొలగించింది.
 
ఆ తర్వాత బన్నీ యాక్ట్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదానికి దారి తీసింది. ఈ యాడ్‌లో నటుడు సుబ్బరాజును బన్నీ కొట్టగా.. ఆ దెబ్బకు సుబ్బరాజు గాల్లో తేలిపోతాడు. ఇదికూడా వివాదాస్పదమైంది. 
 
ఇపుడు శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ యాడ్ చేశాడు. ఆ ప్రకటనపై ప్రస్తుతం వివాదం నెలకొంది. కొత్త ఉపేందర్‌ రెడ్డి అనే సామాజిక కార్యకర్త అల్లు అర్జున్‌పై హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
బన్నీ నటించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యాపార ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆయన బన్నీతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కేసు పెట్టారు. తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంటే సుందరానికి రివ్యూ రిపోర్ట్.. ప్లస్, మైనస్‌లు ఏంటంటే?