షర్మిలతో ఎన్నికల వ్యూహకర్త పీకే బృందం భేటీ

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (18:56 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో భేటీ అయింది. 
 
ఈ భేటీలో పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పాదయాత్ర తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. 
 
వచ్చే ఎన్నికల్లో విజయానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ సేవలు తీసుకోనున్నట్టు షర్మిల ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో స్పష్టంచేశారు. ఆమె చెప్పిన రోజుల వ్యవధిలోనే పీకే టీమ్ రంగంలోకి దిగింది. 
 
రాబోయే ఎన్నికల సమయానికల్లా పార్టీని ఇతర ప్రధాన పార్టీలకు ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా పీకే టీమ్ పని చేయనుంది. పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments