మనిషికి సిగ్గుండాలి.. ఛి..ఛి.. వీళ్ళా తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడేది..? (video)

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (22:37 IST)
తెలుగు జాతి నినాదం ఆత్మగౌరవంతో బతకడం. ఎవరికీ గులాం గిరీ చేయొద్దు. ఇదే నినాదంతో పార్టీలు ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి సలాం చేసే పరిస్థితి ఉండొద్దు అంటారు. కానీ నిన్న అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. దీంతో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. వీళ్లా తెలుగువారీ ఆత్మగౌరవాన్ని కాపాడేది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. 
 
సిగ్గుండాలి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీపై ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఈ ట్వీట్‌కు బండి సంజయ్ చెప్పులు ఇస్తోన్న వీడియో యాడ్ చేశారు. ఛీ ఛీ అంటూ తనదైనశైలిలో ప్రకాశ్ రాజ్ ఫైరయ్యారు. 
 
దీనిపై బండి సంజయ్ స్పందించారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు. మా కుటుంబ పెద్ద, గురుతుల్యుడు వంటి కేంద్ర హోమంత్రికి వయసులో చిన్నవాడినైన నేను చెప్పులు అందించడం గులామ్ గిరీ అవుతుందా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.  
 
"మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం. మీలాగా అవసరాలు తీరాక పాదాలు పట్టి లాగేసే అలవాటు మాకు లేదు. మేం గులామ్ లం కాదు.. మీలాగా మజ్లిస్ కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదు" అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments