ప్రశాంత్ కిషోర్‌తో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ చర్చలు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:59 IST)
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన ప్రశాంత్ కిషోర్ గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ చర్చలు ఆదివారం కూడా జరుగుతున్నాయి. ఇందులో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కూలంకుశంగా చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస విజయావకాశాలపై వారు చర్చిస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 
 
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయి. ఆ రాత్రికి ప్రగతి భవన్‌లోనే బస చేసిన ప్రశాంత్ కిషోర్ ఆదివారం ఉదయం కూడా సీఎం కేసీఆర్‌తో మరో దఫా చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల కోసం తెరాసతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న పీకే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై తన బృందంతో సర్వే చేయించారు. 
 
ఈ సందర్భంగా 30 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను ఆయన సీఎం కేసీఆర్‌‍కు అందించారు. ఆ తర్వా 89 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్‌కు తాజాగా అందించినట్టు తెలుస్తోంది. పైగా, సీఎం కేసీఆర్‌తో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పని చేస్తానని ఈ సందర్భంగా పీకే స్పష్టం చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

Rashmika : దీపావళికి మంచి అప్ డేట్ ఇస్తానంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments