Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (17:47 IST)
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్మాత్మక కట్టడమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
ఢిల్లీ వేదికగా బీజేపీ కార్పొరేటర్ల సదస్సు జరిగింది. ఇందులో ప్రధాని మోడీ సైతం పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
 
అయితే, హైదరాబాద్ నగరానికి చెందిన కార్పొరేటర్లు ప్రధానికి ఓ వినతి చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే టిక్కెట్లు సాధించుకోవాలనే కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని కార్పొరేటర్లను ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 
 
దీంతో వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రధాని మోడీ ఆయన భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోడీ చేసిన సూచనలు కార్పొరేటర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. ప్రధాని హైదరాబాద్ పర్యటన పనులకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments