Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట తప్పం.. మడమ తిప్పం... తెలంగాణ అభివృద్ధికి కట్టుబడివున్నాం : మోడీ

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి భాగ్యనగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడివున్నట్టు ప్రకటించారు. మాట తప్పం.. మడమ తిప్పబోమని, అభివృద్ధి విషయంలో అన్ని రా

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (14:39 IST)
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి భాగ్యనగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడివున్నట్టు ప్రకటించారు. మాట తప్పం.. మడమ తిప్పబోమని, అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 
 
మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన నరేంద్ర మోడీ కొద్దిసేపు బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఒకటి రెండు నిమిషాల పాటు తెలుగులో మాట్లాడి అందరినీ మురిపించారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ఆయన.. తెలుగులోనే ముగించారు. హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. 
 
హైదరాబాద్ అంటే  తనకు సర్దార్ పటేల్ గుర్తుకు వస్తారని అన్నారు. తెలంగాణ విమోచనంలో అమరులైన వీరులకు జోహార్లు పలికారు. హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరమని… నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అభినందనలు అన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఇపుడు అందరి దృష్టి హైదరాబాద్‌పై ఉందని… గ్లోబల్ సమ్మిట్ కోసం ఎంతో మంది దేశవిదేశీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని గుర్తుచేశారు. 
 
బీజేపీ కార్యకర్తలు చేస్తున్న త్యాగం… భారత మాత సేవ కోసం.. సమాజ కోసం చేస్తున్న వారు చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని… దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలో అధికారంలో లేకపోయినా.. సమాజం కోసం అపూర్వ త్యాగాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమని.. తెలంగాణ ప్రజలపై విశ్వాసం ఉందని.. రాష్ట్రంలో ఎవరున్నా.. తమ సహకారం అందుతూనే ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments