Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో మూడు రోజులు మకాం వేయనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు బస చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడే ఉండనున్నారు. తెలంగాణా రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ గడ్డపై మరింతగా బలం పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ నేతలు తెలంగాణాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 15వ తేదీపైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. 
 
అలాగే, ఈ కార్యవర్గ సమావేశాలకు దేశం నలు మూలల నుంచి దాదాపు 300 నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, ఈ సమావేశాలను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లేదా నోవాటెల్ లేదా తాజ్‌కృష్ణ నక్షత్ర హోటళ్లలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. భద్రతగా  పరంగా అన్ని అంశాలను పరిగణలోని తీసుకున్న తర్వాత ఈ కార్యవర్గ సమావేశాలు జరిగే వేదికను ఖరారు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments