Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ RRRకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ.. ఆ కాపీ వుందా? అంటూ ప్రశ్న

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:33 IST)
రిషికొండలో కట్టడాల నిర్మాణాలపై సుప్రీం కోర్టు ఏపీకి షాకిచ్చింది. రిషికొండ ప‌రిధిలో ఉన్న రిసార్ట్‌ను పూర్తిగా కూల్చేసిన ఏపీ ప్ర‌భుత్వం అక్క‌డే దానిని మ‌రింత‌గా విస్త‌రిస్తూ కొత్త రిసార్ట్‌ను క‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌నుల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటోంద‌ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు జాతీయ హ‌రిత ట్రైబ్యూన‌ల్‌ను ఆశ్ర‌యించ‌గా... ప‌నులు నిలిపివేయాలంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఎన్జీటీ ఆదేశాల‌ను ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. ఏపీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు.. ఎన్జీటీ ప‌రిధిపై విస్మ‌యం వ్య‌క్తం చేసింది. 
 
రిషికొండ‌లో కొత్త నిర్మాణాలు కూడ‌ద‌ని చెప్పిన సుప్రీంకోర్టు... పాత నిర్మాణాల‌కు అభ్యంత‌రం లేద‌ని తెలిపింది. ఈ మేర‌కు జ‌స్టిస్ గ‌వాయ్‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది.
 
రిషికొండలో కొత్త‌గా ఏర్పాటు చేస్తున్న రిసార్ట్‌కు సంబంధించి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు బుధ‌వారం ఏపీ ప్ర‌భుత్వానికి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. రిషికొండ రిసార్ట్ విస్త‌ర‌ణ‌కు అనుమ‌తి లేద‌ని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు... పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేప‌ట్టాల‌ని ఆదేశించింది
 
అదే స‌మ‌యంలో ఎన్జీటీ జారీ చేసిన తీర్పు కాపీ ఉందా? అంటూ ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయవాదిని ప్ర‌శ్నించింది. అందుకోసం స‌మ‌యం కావాల‌ని ఏపీ త‌ర‌ఫు న్యాయవాది కోరడంతో విచార‌ణ‌ను బుధ‌వారానికి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments