Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేష‌న్ త‌ర‌హాలో బ‌స్టాండుల్లోనూ ప్లాట్‌ఫాం టిక్కెట్

హైద‌రాబాద్ : ఎవ‌రికైనా సెండాఫ్ ఇవ్వ‌డానికి, రైల్వే స్టేష‌న్లోకి వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఈ ఆలోచ‌న‌ను ఆర్టీసీకి ఆపాదిస్తోంది. ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లలోకి వెళ్లాలన్నా... ప్లాట్‌ ఫాం టికెట్ ఉండాల్సింద

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (18:28 IST)
హైద‌రాబాద్ : ఎవ‌రికైనా సెండాఫ్ ఇవ్వ‌డానికి, రైల్వే స్టేష‌న్లోకి వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఈ ఆలోచ‌న‌ను ఆర్టీసీకి ఆపాదిస్తోంది. ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లలోకి వెళ్లాలన్నా... ప్లాట్‌ ఫాం టికెట్ ఉండాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. 
 
అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ఆర్టీసీ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించింది. వచ్చే జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. టికెట్ ధర రూ.5 ఉండొచ్చని తెలుస్తోంది. మొదట ఈ విధానాన్ని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్లు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments