Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మను సీసీయూ నుంచి ప్రైవేట్ రూమ్‌కు మారుస్తాం.. డిశ్చార్జ్ మాత్రం చెప్పలేం: ప్రతాప్ రెడ్డి

నవంబర్ నాలుగో తేదీ (శుక్రవారం) జయలలిత ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని.. కొన్ని రోజుల తర్వాత ఆమెను సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) నుంచి మర

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (17:58 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె పూర్తిగా కోలుకుంటున్నారని, కొన్ని రోజుల్లో యథాతథంగా రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఎస్.రామచంద్రన్ ధీమా వ్యక్తం చేశారు. డీహైడ్రేషన్, జ్వరంతో బాధపడుతున్న సీఎం జయలలిత సెప్టెంబర్ 22నుంచి చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 
 
అయితే అమ్మకు సంబంధించిన హెల్త్ బులెటిన్ చివరగా అక్టోబర్ 21న విడుదలచేశారు. ఆ తర్వాత జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన, సమాచారం లేకపోవడంతో ఇది ఎన్నో అనుమానాలకు దారితీసింది. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో జయ చికిత్స తీసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో నవంబర్ నాలుగో తేదీ (శుక్రవారం) జయలలిత ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని.. కొన్ని రోజుల తర్వాత ఆమెను సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) నుంచి మరో గదిలోకి మారుస్తామని స్పష్టం చేశారు. చికిత్స పట్ల జయలలిత సంతృప్తి వ్యక్తం చేయగా, ఆమెకు కావాల్సినవి అడుగుతున్నారని తెలిపారు. అయితే జయలలితని డిశ్చార్జ్ చేసే అంశం మాత్రం తమ పరిధిలో లేదని స్పష్టం చేశారు.
 
చైన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే.. జయలలిత ఆరోగ్యం కుదుటపడిందని అన్నాడీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పొన్నియన్ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments