Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లెక్సీలు కట్టినవారికి పెనాల్టీ విధించండి: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి పెనాల్టీ విధించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (06:50 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి పెనాల్టీ విధించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయన శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గీసుకొండ-సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల 20న సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. 
 
దీనికి సంబంధించి కేటీఆర్ పార్క్ స్థలంతో పాటు సీఎం ప్రసంగించే బహిరంగ సభ స్థాలాన్ని పరిశీలించడానికి శనివారం వరంగల్‌కు రానున్నారు. కేటీఆర్ వస్తుడటంతో ఆయన అభిమానులు అడుగడుగునా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టారు. ఇది గమనించిన వికాస్ డానియల్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేశాడు. అధికార పార్టీ నాయకులకి ఫ్లెక్సీల బ్యాన్ వర్తించదా? అంటూ ట్వీట్ చేశాడు. 
 
500లకు పైగా చిన్న సైజు ఫ్లెక్సీలు మెయిన్ రోడ్డుపై పెట్టారని ఓ వీడియోని పోస్ట్ చేశారు. నాయకులు పేరు కోసం ఎంతో డబ్బును వృధాగా ఖర్చు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చాడు. మీ ప్రభుత్వమే ఫ్లెక్సీలను బ్యాన్ చేసి తిరిగి మీరే ఉల్లంగిస్తే ఎంత వరకు సమంజసమంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించాడు.
 
ఈ ట్వీట్‌‍కు కేటీఆర్ స్పందించారు. ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని వరంగల్ మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. అంతేకాకుండా ఫ్లెక్సీలు కట్టింది తన అభిమానులే అని తెలిసినా వారికి పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు. పార్టీలకు అతీతంగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments