తెలంగాణ వాసులకు అది తీరని లోటు.. పవన్ కల్యాణ్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (13:44 IST)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపించిన నిబద్ధత కలిగిన ఉద్యమకారుడని నాయినిని పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశలలో ఆయన గణనీయమైన పాత్ర ఎన్నటికీ మరువలేమని పవన్ పేర్కొన్నారు. కార్మిక నాయకుడు, తెలంగాణవాది, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణం కార్మిక వర్గానికి, తెలంగాణ వాసులకు తీరని లోటు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
 
కార్మిక నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒక పర్యాయం ఎమ్మెల్సీగా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ ఆవిర్భావం తరువాత మంత్రిగా ఆయన పని చేసి ప్రజలకు సేవలందించారన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని పవన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments