Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్ మెయింటనెన్స్ పనులు... 9వ తేదీ వరకు పలు రైళ్ళు రద్దు

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (11:38 IST)
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మరమ్మతు, సిగ్నలింగ్ ఇంజనీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ రైళ్ళను రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 24 రైళ్ళ సర్వీసులను తత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, లింగంపల్లి, ఫలక్ నుమా, ఉందానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నామని, అందువల్ల ప్రయాణికులు సహకరించాలని కోరారు. 
 
కాగా, రద్దు చేసిన రైళ్ల సర్వీసులను పరిశీలిస్తే, కాజీపేట - డోర్నకల్, విజయవాడ - డోర్నకల్, భద్రాచలం - విజయవాడ, విజయవాడ - భద్రాచలం, సికింద్రాబాద్ - వికారాబాద్, వికారాబాద్ - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ - నిజామాబాద్, కాజీపేట - సిర్పూర్ టౌన్, బల్లార్షా - కాజీపేట, భద్రాచలం - బల్లార్షా, సిర్పూర్ టౌన్ - భద్రాచలం, కాజీపేట - బల్లార్షా, కాచిగూడ - నిజామాబాద్, నిజామాబాద్ - నాందేడ్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్ళు ఉన్నాయి. 
 
అలాగే, కాచిగూడ - మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్‌‌ప్రెస్ ఉందానగర్ వరకు, నాందేడ్ - నిజామాబాద్ - పండర్పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తుందని తెలిపింది. 
 
అదేవిధంగా 22 ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా రద్దు చేసింది. వీటిలో లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి - ఉందానగర్ 3, లింగంపల్లి - ఫలక్ నుమా 2, ఉందానగర్ - లింగంపల్లి 4, ఫలక్ నుమా - లింగంపల్లి 2, రామచంద్రాపురం - ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలు సర్వీసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments