Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే పేరుతో ఇద్దరు మహిళలు.. ఆస్పత్రిలో అడ్మిట్... తర్వాత ఏం జరిగింది?

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (12:25 IST)
ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో బతికి ఉన్న మహిళ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. 
 
ఒకే వయసులో ఉన్న ఇద్దరు మహిళలు ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఇద్దరి పేర్లు కూడా ఒకటే కావడంతో ఆసుపత్రి సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఉన్నిసా అనే పేరుతో మహిళలిద్దరూ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అందులో ఒకరికి కరోనా పాజిటివ్ కాగా, మరొకరు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. 
 
కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందింది. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కుటుంబ సభ్యులకు కాకుండా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళ కుటుంబ సభ్యులకు ఉస్మానియా సిబ్బంది, రెయిన్ బజార్ పోలీసులు ఫోన్ చేసి ఆమె చనిపోయినట్టు చెప్పారు. 
 
దీంతో చికిత్స పొందుతున్న ‘‘మా అమ్మ ఎలా చనిపోతుంది’’ అంటూ కుమార్తె నిలదీసింది. ఖంగుతిన్న ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది, రెయిన్ బజార్ పోలీసులు నోరెళ్లబెట్టారు. రెయిన్ బజార్ పోలీసులు మరియు ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చారని, అలాగే తీవ్ర మానసిక వేదనకు గురిచేశారంటూ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments