కాల్ సెంటర్ ఉద్యోగినులే టార్గెట్.. వ్యభిచార కూపంలో అలా దించేస్తారు..

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (12:16 IST)
కాల్ సెంటర్ ఉద్యోగినులే వారి టార్గెట్. వారికి గాలం వేస్తారు. మాయ మాటలు చెబుతారు. వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా మలుచుకుంటారు. ఉపాధి కల్పిస్తామని ఆశ పెడతారు. వారి మాటలు నిజమని నమ్మారో ఇక అంతే.. అడ్డంగా బుక్ అయినట్టే. వ్యభిచార కూపంలో చిక్కుకుంటారు. ఇలాంటి దురాఘతాలకు పాల్పడుతున్న ఓ ముఠాని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కాల్‌సెంటర్‌ ఉద్యోగినులను మాయ చేసి ఆన్‌లైన్‌ వ్యభిచార కూపంలో లాగిన ముఠా సభ్యులను బాలాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.
 
ఏపీలోని అన్నవరానికి చెందిన శివ అలియాస్‌ బడ్డి హైదరాబాద్ లో ఆన్‌లైన్‌ వ్యభిచార కలాపాలు నిర్వహిస్తున్నాడు. పోలవరం మండలానికి చెందిన ఓబిలిషెట్టి సతీష్‌ అలియాస్‌ నాని(28), సూర్యాపేట జిల్లా పాల్‌కిడు మండలం వాసి రామావత్‌ నాగేశ్వరరావు అలియాస్‌ చరణ్‌ నాయక్‌(30), మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన కరిడిగి మహేష్‌ గౌడ్‌ అలియాస్‌ మహేష్‌(31)తో శివ జత కలిశాడు. 
 
అంతా కలిసి ఏడాదిగా జల్‌పల్లి శివారులోని నక్షత్ర విలాస్‌లో ఉంటూ ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేశాడు. దాని ద్వారా అమ్మాయిలను సమకూరుస్తారు. ముందుగానే డబ్బు తీసుకుంటారు.
 
ఈ విషయం పోలీసులకు తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. శివతో ఆన్‌లైన్‌లో కాంటాక్ట్ అయ్యారు. తమకు యువతి కావాలన్నారు. సరేనన్న శివ.. బేరం కుదుర్చుకున్నాడు. 
 
తన గ్యాంగ్ కి చెందిన ముగ్గురితో యువతిని కారులో చెప్పిన చోటుకు పంపాడు. అప్పటికే అక్కడ మాటేసిన పోలీసులు.. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా ఆన్‌లైన్‌ దందా గుట్టురట్టు చేశారు. నక్షత్ర విలాస్‌కి వెళ్లిన పోలీసులు మరో ఇద్దరు యువతులను రక్షించారు.
 
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన తమను ముఠా సభ్యులు వ్యభిచార కూపంలోకి దింపారని యువతులు వాపోయారు. అమ్మాయిలను కూకట్‌పల్లిలోని హోమ్‌కి తరలించారు పోలీసులు. 
 
ఇంకా ఎంతమందిని ఇలా ఈ ఉచ్చులోకి లాగారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు శివను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments