ఇండియన్ ఆర్మీలో 191 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ కోర్స్ కోసం పెళ్లికాని యువతీ యువకులు అప్లై చేయొచ్చు.
పూర్తి వివరాలను https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి వివరాలు చూస్తే.. మొత్తం ఖాళీలు 191 వున్నాయి.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ 4, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 3, ప్రొడక్షన్ 3, ఇండస్ట్రియల్ / మ్యాన్యుఫ్యాక్చరింగ్ / ఇండస్ట్రియల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ 6, ఆప్టో ఎలక్ట్రానిక్స్ 3, ఫైబర్ ఆప్టిక్స్ 2, బయో టెక్నాలజీ 1, బాలిస్టిక్స్ ఇంజనీరింగ్ 1, రబ్బర్ టెక్నాలజీ 1, కెమికల్ ఇంజనీరింగ్ 1, వర్క్‌షాప్ టెక్నాలజీ 3, లేజర్ టెక్నాలజీ 2.
ఇదిలా ఉంటే మహిళలకి సంబంధించి కొన్ని పోస్ట్స్ కూడా వున్నాయి. అఫీషియల్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలని చూడచ్చు. సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి.
ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు. 2021 అక్టోబర్ 1 లోపు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. 20 నుంచి 27 ఏళ్ల వయస్సు వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ 2021 జూన్ 23.