Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన ప్రేమోన్మాది... పెట్రోల్ పోసి యువతిని పట్టుకున్నాడు...

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (12:19 IST)
ప్రేమించలేదంటూ ఓ యువతిపై ఇంటికి వెళ్లి మరీ పెట్రోల్‌తో తనతో పాటు ఆమెకు కూడా నిప్పంటించాడు ఇబ్రహీం అనే కీచకుడు. ఈ దాడిలో అజీనా బేగం అనే యువతితో పాటు ఆమె వదిన కూడా తీవ్ర గాయాలు పాలయ్యింది. 90 శాతం గాయాలతో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ఆ మహిళలు. 
 
వివరాల్లోకి వెళితే... బెహేరేన్‌కు చెందిన ఇబ్రహీం గత కొన్నేళ్ళుగా గల్ఫ్ కంట్రీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆరు నెలల క్రితం టపచాపుత్రకి చెందిన అజీనా బేగం అనే ఓ యువతితో ఫేస్ బుక్‌లో పరిచయం అయింది. అయితే కొద్దిరోజుల క్రితం ఇండియా వచ్చిన ఇబ్రహీం ఆమెను కలవడానికి ప్రయత్నించాడు కానీ ఆ యువతి నిరాకరించింది. 
 
అంతేకాదు ఆ యువతి నీకు పెళ్లయింది నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు... అంటూ అతన్ని పట్టించుకోలేదు.దీంతో రాక్షసుడిలా మారిన ఇబ్రహీం ఈ రోజు ఉదయం పెట్రోల్ క్యాన్‌తో ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసాడు. అతడు కూడా తనపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. తనకు నిప్పంటించుకుని వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. దానితో ఆ మంటలు ఆమెను కూడా చుట్టుముట్టాయి.

ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె వదినకి కూడా మంటలు అంటుకుని తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు 90 శాతం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. కానీ ఈ ఘటనలో ఇబ్రహీంకి 40 శాతం గాయాలయ్యాయి.
 
ఈ ఘటనతో ఒక్కసరిగా ఉలిక్కిపడ్డారు ఆ కాలనీ వాసులు. గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అసలు సంగతి తెలిసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాళ్ళని ఆస్పత్రికి తరించారు. పెట్రోల్ కావడంతో ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments