Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ పాజిటివ్ వృద్ధురాలు, ఆంబులెన్స్ నుంచి దిగి పరార్

Webdunia
శనివారం, 25 జులై 2020 (16:24 IST)
కరోనావైరస్ సోకిన ఓ వృద్ధురాలు చికిత్స కోసం ఆస్పత్రికి రానంటూ హల్చల్ చేసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో చోటుచేసుకున్నది. వివరాలిలా వున్నాయి. శంకరపట్నం మండలంలో ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలికి ఇటీవల కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
 
దీంతో చికిత్స కోసం ఆమెను ఆంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసారు. ఐతే తను ఆస్పత్రికి రానని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. చివరకు ఎలాగో ఆంబులెన్స్ ఎక్కిన ఆ వృద్దురాలు మార్గమద్యమంలో  మలవిసర్జన కోసమని చెప్పి ఆంబులెన్స్ నుండి దిగి పారిపోయింది.
 
ఆ వృద్దురాలు తిరిగి శంకరపట్నం వెళ్లిందని తెలుసుకున్న అధికారులు ఆంబులెన్స్ తీసుకెళ్లగా తాను రానని మొరాయించింది. దాదాపు గంటసేపు అధికారులను ముప్పుతిప్పలు పెట్టించి చివరకు అంగీకరించింది. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకొని వృద్దురాలిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రశ్మిక మందన్న

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments