తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ సెలవు విషయంలో చిన్న మార్పు చేసింది. ఈ నెల 18న పండుగ సెలవు ఉంటుందని ఇదివరకు ప్రభుత్వం ప్రకటించిన జీవోలో ఉంది. అయితే, దీపావళి సెలవును మార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ సెలవు విషయంలో చిన్న మార్పు చేసింది. ఈ నెల 18న పండుగ సెలవు ఉంటుందని ఇదివరకు ప్రభుత్వం ప్రకటించిన జీవోలో ఉంది. అయితే, దీపావళి సెలవును మార్చాలని ప్రభుత్వాన్ని వేదపండితులు కోరారు.
దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమావాస్య రోజున పండుగ జరగాలని సూచించడంతో 19వ తేదీన సెలవుగా నిర్ణయించారు. నరక చతుర్దశికి 17న ఐచ్ఛిక సెలవు ఉండగా.. దాన్ని 18కి మార్చారు. దీంతో 18, 19 తేదీల్లో దీపావళి పండుగ సెలవులు రానున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు 20వ తేదీ శుక్రవారం ఒక్క రోజు సెలవు తీసుకుంటే శనివారం, ఆదివారాల సెలవులతో కలుపుకుని మొత్తం ఐదు రోజుల సెలవులను ఎంజాయ్ చేయొచ్చు.