Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో కిడ్నాపర్లు.. మహిళను లాడ్జికి తీసుకెళ్లి..?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (19:52 IST)
హైదరాబాదులో కిడ్నాపర్లు విరుచుకుపడ్డారు. ఇంట్లో ఉన్న మహిళను బలవంతంగా అపహరించుకెళ్లారు. కారులో కిడ్నాప్ చేశారు. ఓ లాడ్జ్ లో నిర్భంధించి దాడి చేసి.. అమానవీయంగా ప్రవర్తించారు. ఆ యువతికి నరకం చూపించారు. 
 
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నారాయణపురం గ్రామంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది బాధితురాలు.. భర్త ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తుండేవాడు. అయితే, రాయదుర్గం మణికొండ ప్రాంతంలో ఉండే ఆవుల రాజేష్ అనే వ్యక్తి వందల కోట్ల వ్యాపారం చేస్తుంటాడని.. ప్రస్తుతం ఆయనకు కొంత డబ్బు అవసరముందంటూ కొందరు వ్యక్తులు మూడేళ్ల క్రితం బాధిత నర్సును కలిశారు. రూ.55 లక్షల రూపాయలను అప్పుగా ఇస్తే వారం..పది రోజుల్లో రెట్టింపు డబ్బులు ఇస్తానని నమ్మించాడు ఆవుల రాజేష్.
 
అంతేకాదు.. నమ్మకం లేకుంటే వనపర్తిలోని ఏడు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తానని.. డబ్బుకు రెట్టింపు ఇస్తానని నమ్మించాడు.. చెక్కులు ఇచ్చాడు. కానీ, పత్రాల్లో మాత్రం నెల రోజుల్లో బాకీ డబ్బు తిరిగి ఇస్తానని రాసిచ్చాడు. అయితే, బాకీ డబ్బు గురించి అడిగితే వనపర్తిలో ఇస్తానని చెప్పిన ఏడు ప్లాట్లకు బదులు రెండు ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేశాడని బాధితురాలు వాపోయింది.
 
అంతటితో ఆగకుండా బాధిత మహిళ ఇంటికి కారులో వచ్చిన సోమశేఖర్, నక్కల రాజేందర్ యాదవ్, పవన్ రెడ్డి అనే వ్యక్తులు.. ఆ వివాహితను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత శంషాబాద్‌లోని ఓ లాడ్జిలో నిర్బంధించారు. అప్పటికే ఆ లాడ్జిలో ఉన్న మరో ఏడుగురు కూడా కలిసి.. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశారు. మహిళను తాకరాని చోట్ల తాకుతూ పైశాచికానందం పొందారు. 
 
శారీరరంగా, మానసికంగా క్రూరంగా హింసలకు గురిచేశారు. కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కిడ్నాప్‌కు పాల్పడ్డ నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments