Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ కన్నుమూత

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (10:26 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన సచివాలయం సమీపంలోని ఒక దవాఖానాలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్థరాత్రి కన్నమూశారు. 
 
హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో నివాసముండే భరత్... సామాజిక స్పృహ కలిగిన ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా పేరుగడించారు. ఆయన ఇంటికి వెళ్లగానే పల్లెటూరి అందాలతో కూడిన ఫోటోలు మనల్ని కట్టిపడేస్తాయి. ఈయన తీసే ప్రతి ఫోటోకు క్యాప్షన్లు పెట్టనక్కర్లేదు. ఎన్నో పల్లె అందాలను తన కెమెరాల్లో బంధించారు. గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ఫోటోలను తీశారు. 
 
1970లో ఫోటోగ్రఫీ వృత్తిలోకి అడుగుపెట్టిన ఈయన... ఫోటోగ్రఫీనే తన జీవితంగా మలుచుకున్నారు. పు ఇంగ్లీష్, తెలుగు దినపత్రికల్లో ఫోటోగ్రాఫర్‌గా పని చేశారు. తీరిక సమయాల్లో పెయింటింగ్స్ వేసేవారు. తెలంగాణ రాష్ట్ర తొలి వార్షికోత్సవంలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు రూ.5 లక్షల నగదు బహుమతిని అందచేశారు. కాగా, ఆయన మృతి పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు. అనేకమంది మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments