ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి కన్నుమూశారు. ఒరిస్సా రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 యేళ్లు. కోరాపుట్ జిల్లాలో గిరిజన తెగకు చెందిన యువతుల అభివృద్ధి, జీవన ప్రమాణాల పెంపు కోసం ఆమె ఎంతగానో కృషి చేశారు.
అంతేకాకుండా, అనాథులు, పేద పిల్లలు, అభాగ్యుల కోసం 1964లో గుణపురంలో సేవా సమాజ్ ఆశ్రమాన్ని ఆమె ప్రారంభించారు. విద్య, వొకేషనల్ కోర్సుల కోసం ఆమె ఆశ్రయాన్ని కూడా ఓపెన్ చేశారు. గిరిజన యువతులకు విద్యాభ్యాసం కోసం ఆమె అనేక స్కూల్స్‌ను తెరిచారు.
ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో పాటు జమునాలాల్ బజాజ్, రాధానాథ్ రథ్‌పీస్ అవార్డులను ఆమె గెలుచుకున్నారు. శాంతిదేవి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో సంతాపం తెలిపారు. అణగారిన వర్గాల ప్రజల గొంతుకగా ఆమె నిలిచివున్నారని కొనియాడారు.
ఆరోగ్యకర సమాజం కోసం అవిశ్రాంతంగా ఆమె పోరాటం చేసినట్టు మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. శాంతిదేవి కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.