Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో లాక్డౌన్ అమలు ప్రసక్తే లేదు : ఆరోగ్య శాఖ

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (10:44 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మరోమారు లాక్డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూను సంక్రాంతి తర్వాత అమలు చేయబోతున్నాంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు లేదని స్పష్టం చేశారు. 
 
పైగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు అవాస్తవ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజారోగ్య సంచాలకుడు జి. శ్రీనివాసరావు హెచ్చరించారు. పైగా, జనవరి చివరి వారంలో లాక్డౌన్ అమలు చేయొచ్చని తాను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అదేసమంలో ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు.. కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. 
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో కూడా చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. రాష్ట్రంలో 15-18 యేళ్ల మధ్య వయసులో 2.78 లక్షల మంది చిన్నారులు ఉండగా, వారికి తొలిరోజున 24240 మందికి వ్యాక్సిన్లు వేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments