Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఉద్యోగాలు నిల్, ఆ నలుగురు యువకులు ఏం చేశారంటే?

Webdunia
గురువారం, 16 జులై 2020 (19:46 IST)
ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధిద్దామనుకున్నారు. హైదరాబాదు వెళ్లి గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ ఇంతలో కరోనా వాళ్ల ఆశలపై నీళ్ళు చల్లింది. లాక్ డౌన్ కారణంగా వెళ్లిన నలుగురు తిరిగి గ్రామానికి వచ్చారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. నలుగురు కలిసి పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టారు. 
 
కరోనా కష్టాన్ని అధిగమించిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నిరుద్యోగులు రాజు, నరసింహులు, శేషన్న, సత్యన్న బాల్య స్నేహితులు. ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తరువాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నారు కానీ అవకాశము వారిని ఆదరించలేదు.
 
నలుగురు కలిసి గ్రామంలో ఉంటూ ఉపాధి పొందే ఉపాయాన్ని వెతికారు. 7 లక్షల వరకు అప్పు చేసి పొట్టేళ్ళ పెంపకాన్ని ప్రారంభించారు. గ్రామ శివారులో ఒక పెద్ద షెడ్డు వేసుకున్నారు. అప్పటి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే వారికి వీరు మార్గదర్శకులు. కరోనా కొందరికి కష్టాన్ని నేర్పితే, వీరు చాలామందికి జీవితాన్నే నేర్పుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments