భారత్‌లో కరోనా తన ఉగ్ర పంజాను విసురుతున్నది. కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 32,695 కేసులు నమోదు కాగా 606 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల మేరకు దేశంలో మొత్తం 9,68,876 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,31,146 ఉండగా 6,12,814 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలా ఉండగా 24,915 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,26,826 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1,27,39,490 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.