Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌లో పట్టుబడిన నిహారిక కొణిదెల - జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (12:25 IST)
హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటళ్ళల్ రాడిసన్ బ్లూ ప్లాజాలో పుడ్డింగ్, మింక్ పబ్‌లపై ఆదివారం తెల్లవారుజామున జూబ్లీ హిల్స్ పోలీసులు ఆక్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు.. మెగా డాటర్ నిహారిక కొణిదెలతో పాటు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్ నిబంధనలను ఉల్లంఘించి, మూసివేసిన గంటల తర్వాత పబ్ నడపడంతో పోలీసులు పబ్‌పై దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో పబ్‌లో ఉన్నవారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి నుంచి వివరాలు సేకరించి వదిలివేశారు. స్టేషన్‌కు తరలించిన వారిలో సినీ సెలెబ్రిటీల పిల్లలు కూడా ఉండటంతో ఈ వ్యవహరంపై పోలీసు పెద్దలపై ఒత్తిడి పెరిగింది. దీంతో పబ్‌పై దాడి చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు చేపట్టారు. 
 
ఈ పబ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వ్యవహారంలో జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రును పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే, ఏసీపీకి చార్జిమెమో జారీ చేశారు. ఈ పబ్‌పై దాడి వ్యవహారం ఇపుడు హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments