Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి సినిమాలే నిర్మిస్తాః నిహారిక కొణిదెల

Advertiesment
అలాంటి సినిమాలే నిర్మిస్తాః నిహారిక కొణిదెల
, బుధవారం, 22 డిశెంబరు 2021 (20:07 IST)
Niharika Konidela
‘జీ 5’ ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ . పింక్‌ ఎలిఫెంట్స్‌ పిక్చర్స్‌ పతాకంపై మెగా డాటర్‌ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్‌ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఈ రెండూ జీ`5 ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, దూసుకుపోతున్న సందర్భంగా ఈ ఆనందాన్ని పంచుకోవటానికి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌  ఏర్పాటు చేశారు.
 
‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ. . కట్టా గారి విజన్‌ చాలా పెద్దది, గొప్పది. నాకు మంచి కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేయడం చాలా ఇష్టం. అందులో భాగంగా భారీ కమర్షియల్‌ సినిమాలు కూడా ప్రొడ్యూస్‌ చేసే అవకాశం ఫ్యూచర్‌లో ఉండొచ్చు. ఆడియెన్‌గా ఎలాంటి సినిమాలు చూడాలని అనుకుంటానో.. అలాంటి సినిమాలే నిర్మించాలని చూస్తా. జీ వాళ్ల దృష్టిలో కంటెంట్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అది నేను దగ్గరగా చూశాను. నేను చేసిన ముద్దపప్పు ఆవకాయ, నాన్నకుచ్చి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మూడూ జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవుతుండడం చాలా హ్యాపీగా ఉంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సింగిల్‌ థ్రెడ్‌ స్టోరీ. ఈ క్రెడిట్‌ మా డైరెక్టర్‌ మహేష్‌ గారు, రైటర్‌ మానస గారిదే. నాకు కథ చెప్పేటప్పుడే మహేష్‌ గారు నన్ను ఆ కథతో కనెక్ట్‌ చేసి నడిపించారు. ప్రతి సీన్‌ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది. రిపబ్లిక్‌ సినిమా చాలా హానెస్ట్‌ మూవీ. క్లైమాక్స్‌ నాకు అద్భుతంగా అనిపించింది. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాల్ సామాన్యుడు నుంచి థీమ్ మ్యూజిక్