అల్తాఫ్ హాసన్,శాంతి రావు, సాత్విక్ జైన్ , లావణ్య రెడ్డి, భద్రం, ధనరాజ్ నటీనటులుగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సతీష్ కుమార్.ఐ, రామ్ వీరపనేనిలు కలసి సంయుక్తంగా నిర్మించిన బట్టల రామస్వామి బయోపిక్. ఈ సినిమా ఈ రోజు జీ5 ఓటిటి లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ తో హిట్ టాక్ వస్తున్న సందర్భంగా దీనికి కారణమైన మీడియా మిత్రులకు ధన్యవాదాలు.
నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, జీ 5లో విడుదలైన బట్టల రామ స్వామి బయోపిక్కు' చిత్రానికి హిట్ టాక్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. మ్యాంగో టీవీ రామ్ గారు ఈ మూవీ చూసాక ఈ మూవీని మనం రిలీజ్ చేద్దాం అన్నారు. కాకపోతే కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ఓటిటి కి రిలీజ్ చేయవలసి వచ్చింది ఈ సందర్బంగా రామ్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపు తున్నాను .ఇంక ఈ మూవీ డైరెక్టర్ రామ్ నారాయణ్ నాకు తమ్ముడుతో సమానం నా బ్యానర్ నుంచి డైరెక్టర్ గా అవ్వటం చాలా హ్యాపీ గా వుంది, తను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు.ఒక రోజు నా దగ్గరికి వచ్చి నా డ్రీం డైరెక్టర్ అవ్వాలి అని వుంది అన్నయ్య అన్నాడు. అలా అనగానే నాకు తన ప్రీవియస్ వర్క్ మీద వున్న నమ్మకం తో కన్ఫర్మ్ చేశాను.
నేను జీవితం లో రెండు బలంగా నమ్ముతాను ఒకటి వెంకటేశ్వర స్వామిని, రెండు కధ ని, నా దృష్టిలో కధ నచ్చాకే మూవీ ఓకే చేస్తాను, ఒక పని అనుకున్నాను అంటె అది సాధించే వరకు నిద్ర పోను. ఈ మూవీ పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది c/o కంచరపాలెం తరహాలో ఈ మూవీ ప్రేక్షక ఆదరణ పొందుతుంది ఆర్టిస్టులు అందరు చాలా రియాల్టీ గా యాక్ట్ చెశారు సెవెన్ హిల్స్ బ్యానర్ నుంచి అందరి బంధువయా మూవీ తో స్టార్ట్ చేసాం ఇప్పుడు బట్టల రామస్వామి బయోపిక్ తో పాటు గ్లామరస్ యాక్టర్ ఫిమేల్ లీడ్ లో పూర్ణ యాక్ట్ చేస్తున్న బ్యాక్ డోర్ మూవీని ప్రెసెంట్ చేస్తున్నాం అది కూడా మూవీ అంత కంప్లీట్ అయ్యింది,
పాయల్ రాజపూత్ హీరోయిన్ గా ఉగాది పర్వదినాన కొత్త మూవీ ఒకటి స్టార్ట్ చేసాం. నాకు కూడా చిన్న చిన్న క్యారెక్టర్ర్స్ చేయాలి అని వుంది కానీ సాద్య పడలేదు ఇంక ఈ మూవీకి నా భార్య సహ నిర్మాతగా వ్యహరించింది తన సపోర్ట్ నా జర్నీలో చాలా కీలకం అని చెప్పాలి. నేను పుట్టింది జంగారెడ్డిగూడెం దగ్గర విద్యాబ్యాసం ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ, మూవీస్ అంటె మక్కువతో కోడి రామకృష్ణ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసాను. సెవెన్ హిల్స్ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేశాను. రామోజీ రావు గారు, రామానాయుడు గారు, దాసరి నారాయణ రావు గారు, దిల్ రాజు గార్ల ఇన్స్పిరేషన్స్ తో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాను.ఓ.టి.టి లో రిలీజ్ అయిన మా సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అని తెలిపారు.