Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయి నెలరోజులే.. ప్రియుడి మాటలతో పడిపోయి నగలు, నగదుతో జంప్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (23:28 IST)
పెళ్ళయి సరిగ్గా నెలరోజులే అవుతోంది. అంతకుముందు ప్రియుడు ఉన్నాడు. పెళ్ళయిన తరువాత కూడా అతని పరిచయం అలాగే  కొనసాగింది. దీంతో అతన్ని విడిచి ఉండలేని వివాహిత ఇంట్లో నుంచి పారిపోయింది. వెళుతూ వెళుతూ ఇంట్లోని నగలు, నగదును ఎత్తుకెళ్ళింది.
 
హైదరాబాద్ నల్లకుంటలో నివాసముంటున్నారు నాగరాణి, సాయికుమార్‌లు. సాయికుమార్ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితమే బాలాజీనగర్‌కు చెందిన నాగరాణితో వివాహమైంది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. అయితే తరచూ నాగరాణి ఇంట్లో ఫోన్లు మాట్లాడుతూ ఉండేది.
 
తన స్నేహితురాలు అంటూ భర్తకు చెబుతూ ఉండేది. దీంతో అతను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆమె మాట్లాడుతోంది ప్రియుడితో. పెళ్ళయిన తరువాత కూడా అతన్ని ఏమాత్రం వదులుకోలేకపోయింది. అతనికి దగ్గర అవుదామనుకుంటే భర్త ఒప్పుకోడని భావించింది.
 
దీంతో ఇంట్లో తన పుట్టింటి వారితో పాటు మెట్టినింటివారు పెట్టిన నగలు, 50 వేల నగదు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. సెల్ ఫోన్‌ను మరిచిపోయి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన భర్త సెల్ ఫోన్ చూసి ప్రియుడి సందేశాలను గమనించాడు. దీంతో అసలు విషయం అర్థమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments