Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందును పైనుంచి కిందపడేశారు.. వాళ్లు తల్లిదండ్రులేనా?

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (11:03 IST)
Newborn
సభ్య సమాజం తలదించుకునేలా తల్లిదండ్రులు ప్రవర్తించారు. తల్లిదండ్రులు అనే పేరుకు మాయని మచ్చతెచ్చేలా నడుచుకున్నారు. తాజాగా అలాంటి అమానుష ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కుషాయిగూడలో అప్పుడే పుట్టిన పాపను అపార్ట్‌మెంట్‌పై నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాపను చేరదీసి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 
పై నుంచి కిందకి పడివేయడంతో ఆ శిశువు తలకు సిమెంట్ కాంక్రీట్ గుచ్చుకున్నాయి. పసికందును గాయలతో ఉన్న స్థితిలో చూసిన కుషాయిగూడ ఎస్సై సాయికుమార్ చలించిపోయారు. 
 
పాపను తనచేతుల్లోకి తీసుకుని వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 318 (మృతదేహాన్ని రహస్యంగా పారవేయడం ద్వారా పుట్టుకను దాచడం) కింద కేసు నమోదు చేయబడినప్పటికీ, శిశువును విడిచిపెట్టిన తల్లిదండ్రులు లేదా వ్యక్తుల గురించి పోలీసులకు ఇంకా తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments