Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
रविवार, 29 दिसंबर 2024
webdunia
Advertiesment

పొద్దస్తమానం ఫోన్లు మాట్లాడుతుందనీ కుమార్తెను చంపేసిన తండ్రి

murder
, ఆదివారం, 18 డిశెంబరు 2022 (13:26 IST)
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లో ఓ దారుణం జరిగింది. కుమార్తె పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుండటాన్ని కన్నతండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కుమార్తెను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారం ప్రాంతానికి చెందిన యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి రాత్రిపగలు అనే తేడా లేకుండా పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుండటంతో ఆ అలవాటును తగ్గించుకోవాలని తండ్రి మహ్మద్ తౌఫీ పలుమార్లు సూచించాడు. 
 
కానీ, ఆ యువతి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి ఆదివారం ఆ యువతిని కొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం.. సీనియర్ నేతల తిరుగుబాటు