Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంజాయి మత్తులో ఐదుగురిని హత్య చేసిన కిరాతకుడు.. ఆ తర్వాత...

Advertiesment
mass murder
, మంగళవారం, 13 డిశెంబరు 2022 (14:42 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ దారుణానికి పాల్పడిన కిరాతకుడు చేసిన తప్పును తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని సెంగంలో పళనిస్వామి (45) అనే రైతు గత కొంతకాలంగా ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈయనకు గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యా బిడ్డలను దారుణంగా గొడ్డలతో నరికి చంపేశాడు. మృతుల్లో భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. వీరిని త్రిష (15), మోనిష (14), శివశక్తి (6), భూమిక (9 నెలలు)గా గుర్తించారు. 
 
అయితే, మహిళ కొనఊపిరితో ఉండటాన్ని స్థానికులు గుర్తించి తిరువణ్ణామలై ఆస్పత్రికి తరలించగా, ఆమె కూడా మరణించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో తాను చేసిన తప్పును తెలుసుకున్న పళని తన పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమిని అంతరిక్షం నుంచి చూస్తే ఎలా వుంటుందంటే? (video)