కొందరు ధనవంతులు మాత్రమే కాదు.. మధ్యతరగతి ప్రజలు కూడా తమ తమ ఇళ్ళలో జరిగే వివాహాలను తమ స్థాయికి తగినట్టుగా చేసుకుంటారు. పెళ్లిలో వడ్డించే ఆహారం మొదలుకుని అలంకరణ వరకు ఏమాత్రం రాజీపడరు. ఖర్చు కాస్త ఎక్కువైనా ఫర్లేదు కానా రాజీ మాత్రం పడరు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	అయితే, దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత అనేక మంది అన్ని రకాల కార్యాలను తమ వరకే జరుపుకున్నారు. అంటే... తమతమ ఇళ్లకే పరిమితమైపోయాయి. ఇపుడు కరోనా ఆంక్షలన్నీ తొలగిపోయి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పర్యాటక ప్రదేశాలు మళ్లీ యధాస్థాయిలో తెరుచుకున్నాయి. ప్రపంచ దేశాలు కూడా విదేశీ పర్యాటకులను కూడా ఆహ్వానిస్తున్నాయి. 
 
									
										
								
																	
	 
	ఈ నేపథ్యంలో ఓ జంట తమ వివాహం కోసం ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి విమానంలో పెళ్లికి బయలుదేరారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రేయా షా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	తన సోదరి వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత విమామంలోని వారందరినీ చూపించారు. చివర్లో పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటను చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు కోటి మంది వరకు ఈ వీడియోను చూశారు.