Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన్మథుడిలా ప్రియుడు.. ఒక వ్యక్తి కోసం ఐదుగురి కొట్లాట.. వీడియో వైరల్

Advertiesment
romance
, బుధవారం, 30 నవంబరు 2022 (14:55 IST)
బీహార్‌లో ఓ వ్యక్తి కోసం ఐదుగురు మహిళలు నడిరోడ్డుపై గొడవకు దిగిన వీడియో వైరల్‌ అవుతోంది. ఒక వ్యక్తి కోసం అతడి "నాకంటే నాకే" అంటూ జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సోన్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు అందంగా మన్మథుడిలా వున్నాడు. అతను ఒకేసారి చాలా మంది మహిళలతో ప్రేమలో ఉన్నాడు. కానీ ఒకరిపై మరొకరికి తెలియకుండా తన ప్రేమను కొనసాగించాడు. 
 
ఈ సందర్భంలో, సంఘటన జరిగిన అదే రోజు అతను తన స్నేహితురాళ్ళలో ఒకరిని ఆ పట్టణంలోని ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లాడు. వీరిని జంటగా చూసిన ఆ యువకుడి మరో ప్రియురాలు షాకైంది. 
 
వెంటనే యువకుడిని పట్టుకుని వాగ్వాదానికి దిగాడు. యువకుడితో మహిళ వాగ్వాదానికి దిగడం చూసిన మూడో ప్రియురాలు మహిళ వద్దకు వచ్చి గొడవకు దిగింది. 
 
ఈ విధంగా యువకుడి ఐదుగురు ప్రియురాళ్లు ఒకే చోట చేరి ఆ యువకుడి కోసం జుట్టుపట్టుకున్నారు. ఈ తతంగాన్ని చుట్టుపక్కల వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Digital Rupee: డిజిటల్ రూపీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు