Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థాయ్ యువరాణి: గుండె సంబంధిత సమస్యతో కుప్పకూలిన రాజు పెద్దకూతురు

Thai Queen
, గురువారం, 15 డిశెంబరు 2022 (20:49 IST)
కర్టెసి- రాయల్ థాయ్‌లాండ్
థాయ్ రాజు పెద్ద కూతురు బుధవారం సాయంత్రం గుండె సంబంధిత సమస్యతో కుప్పకూలినట్టు థాయ్‌ల్యాండ్ రాయల్ ప్యాలస్ ప్రకటన విడుదల చేసింది. ఈశాన్య బ్యాంకాక్‌లో తన పెంపుడు కుక్కలకు శిక్షణ ఇస్తున్న సమయంలో థాయ్ రాజు వజిరలాంగ్ కార్న్ పెద్ద కూతురు, యువరాణి బజ్రకితియభ గుండె సంబంధిత వ్యాధితో కుప్పకూలినట్టు ప్యాలస్ పేర్కొంది.
 
థాయ్ రాజు మొదటి భార్య సోమ్‌సావాలి కూతురే ఈ యువరాణి. ఆయనకు పెద్ద బిడ్డ తానే. యువరాణికి ప్రస్తుతం 44 ఏళ్ల వయసుంటుంది. రాజువజిరలాంగ్ కార్న్ తన తర్వాత వారసుల పేరును ఇప్పటి వరకు ప్రకటించనప్పటికీ, ఆయన తర్వాత ఈమెనే ఈ పదవిని చేపట్టబోయే వారసురాలిగా భావించే వారు. రాజుకి ఉన్న ముగ్గురు పిల్లల్లో 1924 ప్యాలెస్ ఆఫ్ సక్సెషన్ కింద బజ్రకితియభనే తర్వాత యువరాణి పీఠంపై ఆశీనులయ్యేందుకు అర్హురాలిగా ఉన్నారు.
 
యువరాణి అస్వస్థతకు గురైన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను హెలికాప్టర్‌లో బ్యాంకాక్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. యువరాణి ఆరోగ్య పరిస్థితి గత రాత్రి సమయానికి కొంత వరకు నిలకడగా మారినట్టు ప్యాలస్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందో ఈ స్టేట్‌మెంట్ చెప్పడం లేదు. అయితే ఆమె ఆరోగ్యం రాయల్ ప్యాలస్ చెప్పిన దాని కంటే మరింత ప్రమాదకరంగా ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.
 
2016లో రాజు భూమిబోల్‌పై తన తండ్రి గెలిచిన తర్వాత ఆయన అంతర్గత సర్కిల్‌లో ఆమె కీలకంగా మారారు. రాజు వ్యక్తిగత సంరక్షణలో సీనియర్ ఆఫీసర్‌గా కూడా ఉన్నారు. అమెరికా రెండు యూనివర్సిటీల నుంచి ఆమె పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను పొందారు. ఆమె ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు. థాయ్‌ల్యాండ్‌లో పీనల్ సంస్కరణల విషయంలో ఆమెంతో కృషి చేశారు. మహిళా ఖైదీల కోసం ఆమె పనిచేశారు. 2012 నుంచి 2014 వరకు ఆస్ట్రియాకు థాయ్‌ల్యాండ్ రాయబారిగా బజ్రకితియభ పనిచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఆర్ఎస్‌కు త్వరలోనే వీఆర్ఎస్ : జేపీ నడ్డా జోస్యం