Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో అత్యంత సంపన్నమైన నగరాల జాబితాలో భాగ్యనగరం

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (11:57 IST)
హైదరాబాద్ నగరం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన నగరాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ భాగ్యనగరిలో మొత్తం 11100 మంది మిలియనీర్లు ఉన్నట్టు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ వెల్లడించింది.2012-22 మధ్య హైదరాబాద్ నగరంలో అత్యధిక నికర సంపదగల వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరగడం గమనార్హం. 
 
ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ సిటీ తొలి స్థానంలో నిలిచింది. గత 2022 డిసెంబరు 31వ తేదీ నాటికి మహానగరంలో 3.40 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023లో ఈ కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇందులో మొత్తం 97 పట్టమాలు చోటు దక్కించుకోగా వీటిలో ఒకటి హైదరాబాద్ నగరం నిలిచింది. 
 
ఇకపోతే జపాన్ రాజధాని టోక్యో నగరంలో 2.90 లక్షల మంది మిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా 2.85 లక్షల మంది మిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది. అలాగే, లండన్‌లో 2.58 లక్షల మంది, సింగపూర్‌లో 2.40 లక్షలమంది, లాస్ ఏంజెల్స్‌లో 2.05 లక్షల మంది, బీజింగ్‌లో 1.28 లక్షల మంది, షాంఘైలో 1.27 లక్షల మంది, సిడ్నీలో 1.26 లక్షల మంది చొప్పున మిలియనీర్లు ఉన్నారు. 
 
ఇకపోతే, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఈ జాబితాలో 59400 మంది మిలియనీర్లతో 21వ స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఢిల్లీలో 30200 మంది మిలియనీర్లతో 36 స్థానంలో నిలిచింది. బెంగుళూరు 12600 మందితో 60వ స్థానంలో నిలువగా, కోల్‌కతా నగరం 12100మంది 63వ స్థానంలోనూ, హైదరాబాద్ నగరం 11100 మందితో 65వ స్థానంలో నిలిచింది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments